సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల రంగం, నదీ జలాల సమస్యలు, నిర్మాణం మరియు వినియోగంలో ఉన్న భారీ – మధ్య తరహా ప్రాజెక్టుల స్థితిగతులు, ప్రతిపాదనలో ఉన్న పోలవరం – బనకచెర్ల ఎత్తిపోతల పథకం మంచి – చెడు, చిన్ననీటి పారుదల వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆలోచనాపరులు – సామాజిక ఉద్యమకారులు నిశితంగా పరిశీలన చేసిన మీదట ఈ క్రింది నిర్ధిష్టమైన అభిప్రాయాలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.