2026 ఆగస్టు 13న కామ్రేడ్ ఫిడేల్ కాస్ట్రో 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ, నా జ్ఞాపకాలు 1987 నాటి క్యూబా పర్యటన వైపు మళ్ళాయి. ఇంటర్నెషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ (ఐయుఎస్) 15వ మహాసభ హవానాలో ఆ ఏడాది నవంబరు 16-20 తేదీల్లో జరిగింది. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఏఐఎస్ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను భారత దేశ నుండి ప్రతినిధిగా పాల్గొన్నాను. కామ్రేడ్ ఫిడేల్ విప్లవ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినే అరుదైన అవకాశం నాకు లభించింది.
![]()